దేశ,విదేశాల్లో పేరు,ప్రఖ్యాతులు సంపాదించిన పారిశ్రామిక దిగ్గజాల వారసులు తమ కంపెనీలలో వివిధ హోదాలలో పనిచేస్తూ పేరుతెచ్చుకుంటున్నారు. దేశంలోని పలు టాప్ కంపెనీల అధినేతలు అయిన ఈ దిగ్గజాల వారసులు తమ కంపెనీల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ యువ పారిశ్రామికవేత్తలు తమ తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తమ సంస్థలను మరింత అభివృద్ది చేసేందుకు నడుం బిగించారు.
ఇటువంటి కొందరు యువ పారిశ్రామికవేత్తల గురించి తెలుసుకుందాం...
సిద్దార్థ మాల్యా...
లిక్కర్‌కింగ విజయ్ మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా(23). విజయ్ మాల్యా తన తనయుడు సిద్దార్థకు 18 సంవత్సరాల వయసులోనే కంపెనీలో బాధ్యతలను అప్పగించారు. సిద్దార్థకు ముందుగా తమ యుబి గ్రూప్ టాప్ లెవెల్ మేనేజ్‌మెంట్‌లో ఓ ఉన్నతస్థానాన్ని అప్పగించారు. అప్పటి నుంచే కంపెనీ పదవీ,బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ తండ్రిచేత ప్రశంసలనందుకుంటున్నాడు సిద్దార్థ. కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలను అనుకున్న స్థాయిలో నిర్వహిస్తూ తమ లిక్కర్ బ్రాండ్‌ను అందరికీ దగ్గరికి చేర్చడంలో సిద్దార్థ కృతకృత్యుడవుతున్నాడు. ఇక సిద్దార్థ నాయకత్వలో యుబి గ్రూప్ ప్రముఖ బ్రాండ్ వైట్ అండ్ మెకేను 2007లో చేజిక్కించుకోవడంలో సఫలీకృతమైంది. 2010లో సిద్దార్థ యునైటెడ్ స్పిరిట్స్‌లో సేల్స్ ఔట్‌లెట్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలను చేపట్టాడు.
రిషద్ ప్రేమ్‌జీ...
ప్రముఖ సంస్థ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వారసునిగా ఆయన పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ రంగ ప్రవేశం చేశాడు. ఆయన ప్రస్తుతం కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ,బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు ఆయన కంపెనీ ఛీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేశాడు. రాబోయే రోజుల్లో కంపెనీ చైర్మన్ కానున్న ఆయన ఇప్పటికే ఎంతో సమర్థవంతంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. దీంతో తండ్రి అజీమ్ ప్రేమ్‌జీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక రిషద్ విప్రోలో 2007 జూలైలో చేరాడు. ముందుగా ఆయన కంపెనీ బ్యాంకింగ్, ఫైనాన్స్ డివిజన్ బిజినెస్ మేనేజర్‌గా చేశాడు. 2009లో ఇన్వెస్టర్ రిలేషన్స్ జనరల్ మేనేజర్‌గా చేయగా 2010లో ఛీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఎ పూర్తి చేసిన రిషద్ వెస్లీ యూనివర్సిటీలో బిఎ (ఎకనామిక్స్)పూర్తిచేశాడు.
లక్ష్మి వేణు...
టివిఎస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ కూతురే లక్ష్మి వేణు(27). ఆమె వివాహం ఇటీవలే ఇన్పోసిస్ ప్రముఖుడు రోహన్ మూర్తితో జరిగింది. ఆమె టివిఎస్ మోటార్స్‌కు చెందిన సుందరమ్ క్లేటన్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ,బాధ్యతలను నిర్వహిస్తోంది. వార్విక్ యూనివర్సిటీ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజ్‌మెంట్‌లో పిెహచ్‌డి, ఏల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పిజిని ఆమెపూర్తి చేసింది. ‘లక్ష్మి మా వ్యాపార కార్యకలాపాల్లో ఎంతో సహకరిస్తోంది. ఆమె ప్రొఫెషనల్‌గా నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను లాభాల బాటల పయనింపచేస్తోంది. కొత్త ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో ఆమె వినూత్న శైలి ని అనుసరిస్తోంది’ అని వేణు అన్నారు.
పల్లవి గోపినాథ్...
ఎయిర్‌దక్కన్ వ్యవస్థాపకుల లో ఒకరైన జి.ఆర్.గోపి నాథ్ కుమార్తె పల్లవి గోపినాథ్. దేశంలోని తక్కువ టిక్కెట్ ఛార్జీలను వసూలు చేసిన వైమానిక సంస్థగా ఎయిర్ దక్కన్ పేరు గాంచింది. ఇక మీడియా, లిటరేచర్, ఏరోస్పేస్‌లలో మాస్టర్ డిగ్రీలను సంపాదించిన పల్లవి గోపినాథ్ 2008లో దక్కన్ 360లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది.
శ్రవీణ్ మిట్టల్...
భారతి ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ కుమారుడు శ్రవీణ్ మిట్టల్(23) తమ కంపెనీలో కొత్తగా చేరాడు. ఆయన భారతి ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్-నెదర్లాండ్స్(బిఎఐఎన్) మేనేజర్‌గా పదవీ, బాధ్య తలు స్వీకరించాడు. కొత్త బాధ్యతలను నిర్వహణలో ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. పట్టుదల, నిరంతర కృషితో అనుకు న్న లక్ష్యాలను సాధించేందుకు ఆయన పనిచేస్తున్నాడు. ‘పలు ప్రముఖ కంపెనీల అధినేతలు తమ కుమారులను నేరుగా ఉన్నత స్థానాల్లో నిలబెట్టకుండా వారిని కింది నుంచి పైకి వివిధ స్థానాల్లో పదవీ,బాధ్యతలు నిర్వర్తిం చే విధంగా చూస్తున్నారు. దీంతో చివరికి కంపెనీ అధి నేతగా చేరుకున్న తర్వాత సంస్థను పూర్తిగా అభివృద్దిపరుస్తూ లాభాల బాటలో పయ నింపచేసేందుకు అనుకున్న అనుభవం వారికి కలుగుతుంది’ అని సెంటర్ ఆఫ్ సోషల్ అండ్ ఆర్గనైజేషనల్ లీడర్‌షిప్ (సిఎస్‌ఒఎల్)కు చెందిన విజయ్‌కుమార్ తెలిపారు.
రోష్నీ నాడర్...
హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ కుమార్తె రోష్ని నాడర్ 2009లో తమ కంపెనీలో చేరింది. ఆమె హెచ్‌సిఎల్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా 27 సంవత్సరాల వయసులో చేరింది. అంతకుముందు ఆమె శివ్ నాడర్ ఫౌడేషన్‌కు అధినేతగా వ్యవహరిం చింది. ఇక రోష్ని గతంలో టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా సైతం చేసిం ది. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి సోషల్ ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్ కోర్సును రోష్ని పూర్తిచేసింది.
1 comment:
Nice info
Post a Comment