ప్రపంచంలోని ఎన్నో రాజకుటుంబాల గురించి తరచూ మీడియాలో రకరకాల వార్తలు వస్తుంటారుు. మన దేశానికి చెందిన రాజకుటుంబాల వివరాలు, విశేషాలు బయటకు రావడం తక్కువే. నిజానికి రాజ రికానికి పెట్టింది పేరు భారతదేశం. స్వాతంత్య్రం వచ్చే వరకూ దేశంలో వందలాది సంస్థానాలు, కొన్ని పెద్ద రాజ్యాలు బ్రిటిష్ రాణి పాలనను అంగీకరిస్తూనే తమ స్వతంత్రప్రతిపత్తిని నిలబెట్టుకున్నారుు. ఆనాటి రాజ్యాలు పోరుునా, ఆ రాజవంశీకుల జ్ఞాపకాలు మాత్రం నేటికీ ప్రజల మనస్సుల్లో మిగిలిపోయారుు. ఆ నాటి రాజకుటుంబీకుల వారసుల ప్రస్తుత జీవితపు తీరుతెన్నులపై ప్రజానీకంలో ఆసక్తి అలా కొనసాగు తూనే ఉంది. రాజకుటుంబాల వారసులుగా ఉన్న వారిలో పలువురు నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నా రు. వీరిలో కొందరు రాజకీయాల్లోనూ ఉన్నారు. వీరంతా కూడా ‘రాజు’ హోదా దక్కని ‘యువరాజు’లే! బ్రిటన్ విలియవ్గ్సు, హ్యారీల గురించి కాసేపు మర్చిపోదాం. మన యువరాజుల గురించి తెలుసుకుందాం!
పటౌడీ పట్టాభిషేకం
రాజ్యాలు పోయినా రాజ్యాభిషేకాలు మాత్రం ఆగడం లేదు. ఏ విధమైన అధికారిక గుర్తింపు లేకపోయినప్పటికీ, యువ రాజులను పట్టాభిషిక్తులను చేయడం నేటికీ కొన్ని రాజవంశాల్లో ఆనవాయితీగా వస్తోంది. పటౌడీ రాజకుటుంబాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను ఇటీవలే పటౌడీ (హర్యానా) నవాబుగా పట్టాభిషిక్తుడిని చేశారు. తల్లి షర్మిలా ఠాగూర్ స్వయంగా పట్టం కట్టారు. పటౌడి లోని పురాతన రాజభవనంలో జరిగిన ఈ వేడుకకు చుట్టుపక్కల వందలాది గ్రామాల ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు.
ప్రొఫైల్..
పేరు : సైఫ్ అలీ ఖాన్
పుట్టిన తేదీ : 16 ఆగస్టు 1970
తల్లిదండ్రులు: మన్సూర్ అలీ ఖాన్,
షర్మిలా ఠాకూర్
వృత్తి : సినీ నటుడు, నిర్మాత
సహచరి : అమృత సింగ్ (ప్రస్తుతం) కరీనా
పిల్లలు : ఇద్దరు
ఉదయ్‌పూర్ యువరాజు
రాజకుటుంబానికి ఆస్తుల పర్యవేక్షణ చూడడంతో పాటుగా వివిధ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటుంటారు. క్రికెట్ అంటే ఆసక్తి. ఉదయ్‌పూర్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు చూస్తుంటారు. ఇటీవలే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
ప్రొఫైల్..
పేరు : లక్ష్యరాజ్‌సింగ్ మేవార్
వయస్సు : 26
రాజ్యం : మేవార్
తల్లిదండ్రులు: అరవింద్ సింగ్, విజయ్‌రాజ్ కుమారి
అభిరుచి : ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, చిత్రలేఖనం
విశేషం : మహారాణా ప్రతాప్‌సింగ్
వంశానికి చెందిన వ్యక్తి
పత్రిక ఎడిటర్‌గా త్రిపుర రాకుమారుడు
మాణిక్య వంశానికి చెందిన ఈ రాకుమారు డు ‘ది నార్త్‌ఈస్ట్ టుడే’ అని పత్రికకు సంపాదకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. త్రిపురలో ఈ పత్రిక బాగా ఖ్యాతి చెందింది కావడం విశేషం. వివిధ సామాజిక కార్యకలాపా ల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రొఫైల్..
పేరు : కిరీట్ ప్రద్యోత్ దేవ్ బర్మన్
వయస్సు : 33
రాజ్యం : త్రిపుర
పుట్టిన తేది : 4 జులై 1978
నిరాండంబర రాజకుమారుడు
వారసత్వ పోరు కొనసాగిస్తున్న ఈ రాజకుమారు డు నిరాడంబరంగా జీవించడాన్నే ఇష్టపడడం విశేషం.
ప్రొఫైల్..
పేరు : దేవ్‌రాజ్ సింగ్
వయస్సు : 30
రాజ్యం : జైపూర్ (ఇసార్దా)
పుట్టిన తేది : 4 జులై 1978
విశేషం : మహారాణి గాయత్రీదేవి
వారసుల్లో ఒకరు
రాజకీయాల్లో రాణింపు
డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసు కున్న సింధియా 1993లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బి.ఎ (ఎకనామిక్స్) చదివారు. 2001లో అమెరికాలో ఎంబీఏ చేశారు. 2002 ఫిబ్రవరిలో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నిక య్యారు. 2009లో కేంద్రంలో మంత్రి పదవి స్వీకరించారు. భార్య ఒక హోటల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
ప్రొఫైల్..
పేరు : జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా
వయస్సు : 40
రాజ్యం : గ్వాలియర్
తల్లిదండ్రులు: మాధవరావు, మాధవి రాజె
పుట్టిన తేది : 1 జనవరి 1971
పార్టీ : కాంగ్రెస్
భార్య : ప్రియదర్శిని రాజె సింధియా
హోదా : వాణిజ్యం,
పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
మోడలింగ్‌లో రాణింపు
ఆర్కేష్ తాత మహరాజా రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ ఒరిస్సాకు తొలి ముఖ్యమంత్రి. ఈ రాకుమారుడు మాత్రం రాజకీయాల కన్నా మిన్నగా మోడలింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నాడు. న్యూయార్క్‌లో నటనలో, ముంబయిలో థియేటర్ ఆర్ట్‌సలో శిక్షణ పొందాడు.
ప్రొఫైల్..
పేరు : ఆర్కేష్ సింగ్ దేవ్
వయస్సు : 25
రాజ్యం : బోలన్‌గిర్ (ఒడిషా)
రఘోఘడ్ రాజ్‌పుత్
తండ్రి అడుగుజాడల్లో జయవర్ధన్ సింగ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. సింధియాలకు మంచి పట్టు ఉన్న గుణ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో జ్యోతిరాదిత్య సింధియాకు ప్రత్యర్థిగా జయవర్ధన్ సింగ్‌ను అభివర్ణిస్తుంటారు.
ప్రొఫైల్..
పేరు : జయవర్ధన్ సింగ్
వయస్సు : 27
రాజ్యం : రఘోఘడ్